Share News

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

ABN , Publish Date - Apr 15 , 2025 | 09:32 PM

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

బెంగళూరు: సంచలనం సృష్టించిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case)లో అరెస్టయిన బళ్లారి నగల వ్యాపారి సాహిల్ సకారియా జైన్ (Sahil Sakariya Jain) బెయిల్ అభ్యర్థనను బెంగళూరు కోర్టు మంగళవారంనాడు తిరస్కరించింది. ఈ కేసులో మూడవ నిందితుడైన జైన్ బెయిల్‌ అభ్యర్థనను బీఎన్ఎస్ఎస్-2003 సెక్షన్ 480 కింద తిరస్కరిస్తున్నట్టు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ ప్రకటించారు.

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు


బెయిల్ కోరుతూ జైన్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనపై డీఆర్ఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీర్పును తొలుత రిజర్వ్ చేసి అనంతరం బెయిలును తిరస్కరిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది. రన్యారావు రూ.40.13 కోట్ల విలువైన 49 కిలోల బంగారం డిస్పోస్ చేయడానికి జైన్ సహకరించారని, అలాగే హవాలా మార్గంలో సహకరించిన ప్రతి లావేదేవీకి రూ.55,000 చొప్పున ఆయన కమిషన్‌గా పొందారని పేర్కొంది.


రెన్యా స్టేట్‌మెంట్‌ కోసం డీఆర్ఐ పిటిషన్

కాగా, బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న రన్యారావు నుంచి ఈనెల 18,19 తేదీల్లో స్టేట్‌మెంట్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ డీఆర్ఐ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టులో తాజా పిటిషన్ వేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని రన్యారావు తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 25 , 2025 | 04:42 PM