Home » KCR
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్దైతే.. సోనియాగాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శాసనసభ తొలిసారిగా అట్టుడికింది. అధికార, ప్రతిపక్షాల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య బుధవారం ఆద్యంతం వాడివేడిగా జరిగింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని... అందరినీ వెన్నుపోటు పొడిచిందని.. ఈ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
పోడు భూములకు పట్టాలివ్వాలని పదేళ్లుగా పోరాటం చేస్తుంటే పోడు రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పడం సభను తప్పుదోవపట్టించడమేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు.
‘ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే.. నా లెవల్ వేరే ఉండేది. నేనే హోంమంత్రి అయ్యేవాడిని’ అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మిషన్ భగీరథ ఎంతమందికి అందిందనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ముగిసింది. 7.50 లక్షల ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని తేలింది. ఈ మేరకు పూర్తి స్థాయి నివేదిక ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి అందింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనసభకే రానప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలెందుకని ప్రశ్నించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పారన్నారు. అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు? సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం మాట్లాడుతూ...‘‘సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే.. ఆల్రెడీ చర్లపల్లి జైలులో అన్నట్లు ఉంది. ఈ సభ్యుడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. సత్య హరిచంద్రుడి వంశంలో పుట్టాం....
‘‘కాళేశ్వరం కట్టినప్పుడు.. కూలినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే? కూలినప్పుడు కూడా వారే అధికారంలో ఉన్నారు. రీ-డిజైనింగ్, రీ-ఇంజనీరింగ్‌తోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది.