Home » KCR
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నీటిపారుదలశాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు/డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు.
బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకుని రోడ్డెక్కితే ఆయాసం వస్తుందని.. ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసమని, ప్రజా పాలనతో అందుబాటులో ఉంటూ, ఇబ్బందులు వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పావలా చొప్పున నాలుగు సార్లు రైతు రుణ మాఫీ చేసి.. రూ. 8500 కోట్ల మేర రైతులకు ఎగనామం పెట్టారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో రైతులను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.
తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనకు, ఇప్పుడు సీఎం రేవంత్ పాలనకు తేడా లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.