Share News

Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:29 PM

గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పావలా చొప్పున నాలుగు సార్లు రైతు రుణ మాఫీ చేసి.. రూ. 8500 కోట్ల మేర రైతులకు ఎగనామం పెట్టారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో రైతులను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.

Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’

యాదాద్రి, ఆగస్ట్ 22: రైతులకు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చూసి బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారం ఇలాగే కొనసాగితే... రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలను ప్రజలు నమ్మె పరిస్థితి అయితే ఉండదన్నారు.

ఆ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి గుండు సున్నా ఫలితాలే వస్తాయని బీర్ల ఐలయ్య జోస్యం చెప్పారు. మా ఇంటి ఇలవేల్పు యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో ప్రజలను మోసం చేసిన వారు.. యాదాద్రికి వచ్చినందుకే ఐదు ట్యాంకులతో శుద్ధి చేస్తున్నామని వివరించారు. గురువారం యాదాద్రిలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు.

Also Read: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు


ఎగనామం పెట్టిన నాటి కేసీఆర్ ప్రభుత్వం..

గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పావలా చొప్పున నాలుగు సార్లు రైతు రుణ మాఫీ చేసి.. రూ. 8500 కోట్ల మేర రైతులకు ఎగనామం పెట్టారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో రైతులను బీఆర్ఎస్ నేతలు ఏ మాత్రం పట్టించుకో లేదన్నారు. అంతేకాదు.. రైతుల పేరుతో రాజకీయానికి సైతం తెర తీశారంటూ ఆ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు తమ ప్రభుత్వం మిత్తి కడుతుందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో రైతుల కోసం 27 రోజుల్లోనే రూ.18 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీ చేశారని వివరించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసినందుకే ప్రజలు.. ఇంటికి పరమితం చేసిన విషయాన్ని మరవ వద్దంటూ బీఆర్ఎస్ నేతలకు బీర్ల ఐలయ్ హితవు పలికారు.

Also Read: Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’


సెంటిమెంట్‌తోనే వరుసగా రెండు సార్లు అధికారం..

తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తోనే వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించారని.. అందుకే ఆ పార్టీ నేతలను ఇంటికే పరిమితం చేశారని ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య వివరించారు.

Read More Telangana News and atest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 05:29 PM