Home » KCR
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో చేసిన 11 ఎకరాల భూకేటాయింపు చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి(Narasimha Reddy)ని మార్చాలన్న ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై హై ఓల్టేజ్ డిస్కషన్ జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేయడం, దానిని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) రైతులను గందరగోళానికి గురి చేస్తోందంటూ కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి (Kodanda Reddy) మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు సోమవారం విడుదల చేసినట్లు కోదండరెడ్డి చెప్పుకొచ్చారు.
Telangana: విద్యుత్ కమిషన్ చైర్మెన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వాఖ్యలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కాకముందే ప్రెస్స్ మీటలు పెట్టి చెప్పటం తప్పు అని చెప్పిందన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటంపైన తీవ్రంగా తప్పుబట్టడం...
విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (మంగళవారం) విచారణ జరిగింది.
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి నేతృత్వంలో కమిషన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణం ఉన్న ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదన్నారు.