Rajagoplreddy: ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌వన్నీ గొప్పలే..!
ABN , Publish Date - Jul 29 , 2024 | 01:02 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ రంగంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పారన్నారు. అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు? సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూలై 29: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ రంగంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పారన్నారు. అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు? సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల మేరకు విద్యుత్ కేటాయించారని విమర్శించారు. విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని ఎమ్మెల్యే అడిగారు. విద్యుత్ అవకతవకలపై కమిషన్ దర్యాప్తు చేస్తోంద్నారు.
Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. అసలు ఎవరీయన?
గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టిసిందని.. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిపై జగదీశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. యాదాద్రి పవర్‌ప్లాంట్ లాభదాయకం కాదని 2018లోనే చెప్పానని అన్నారు. పవర్‌ప్లాంట్ పూర్తికి అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. డబ్బులు పోయినా పవర్‌ప్లాంట్ పూర్తికాలేదన్నారు. రామగుండంలో పవర్‌ప్లాంట్ ఏర్పాటు విభజన చట్టంలో ఉందన్నారు. రామగుండం కాదని యాదాద్రిలో ఎందుకు కట్టారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రాజులా ప్రవర్తించారని... నన్ను ప్రశ్నించేది ఎవరు అనే అహంతో కేసీఆర్ ప్రవర్తించారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత
యాదాద్రి ప్రాజెక్టులో పాత మోటార్లను ఉపయోగించారని తెలిపారు. థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇచ్చారన్నారు. ప్రాజెక్ట్ అంచనాలను ఇష్టానుసారంగా పెంచారన్నారు. బీహెచ్‌ఈఎల్‌కు రూ.20 వేల కోట్ల పనులు నామినేటెడ్ పద్థతిన ఇచ్చారన్నారు. బొగ్గు అందుబాటులో ఉన్నచోట పవర్ ప్రాజెక్ట్ పెట్టాల్సి ఉందన్నారు. బొగ్గు గనులకు 280 కిలో మీటర్ల దూరంలో దామరచర్ల దగ్గర థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి చౌకగా విద్యుత్ తెచ్చుకోవచ్చని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..
CM Revanth: విద్యుత్ కొనుగోళ్లపై సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
Read Latest Talangana News And Telugu News