Home » Kejriwal
దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అరెస్టు అయినప్పటికీ దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నీచమైన రాజకీయం అని ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సపోర్ట్ గా నిలిచినందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన తర్వాత ఆప్ నేతల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ లక్ష్యంగా ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆప్ మంత్రులను అధికార నివాసాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రిమాండ్ పిటిషన్‌ను ఆదివారం లోపు విచారించాలని కోరారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డారు. ఆప్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు అవుతోంది. ప్రాంతీయ పార్టీ నుంచి గత ఏడాది జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. ఇంతలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి, పార్టీని భూ స్థాపితం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ చదవుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwa) అరెస్టును బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.