Share News

Arvind Kejriwal Arrest: దేశ ప్రజలకు కేజ్రీవాల్ లేఖ.. అందులో ఏముందంటే..!

ABN , Publish Date - Mar 23 , 2024 | 01:30 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ చదవుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు

Arvind Kejriwal Arrest: దేశ ప్రజలకు కేజ్రీవాల్ లేఖ.. అందులో ఏముందంటే..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ చదవుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు. తన జీవితమే ఒక పోరాటమని.. శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితమని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, గత జన్మలో తాను చేసుకున్న పుణ్య ఫలితంగా ఇప్పుడు భారత్‌లో పుట్టానని, దేశాన్ని మహా శక్తిగా చేయాలన్నారు. ప్రస్తుతం మనల్ని బలహీన పర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో చాలా మంది దేశ భక్తులు ఉన్నారని, వాళ్లంతా ఈ దేశాన్ని మహాశక్తిగా చేయగలరని లేఖలో తెలిపారు. తాను జైలుకు వెళ్లడంతో ప్రతి నెల వెయ్యి రూపాయాలు వస్తాయా లేదా అని చాలా మంది మహిళలు ఆలోచిస్తున్నారని.. కేజ్రీవాల్ ని ఆపే సంకెళ్లు, జైళ్లు లేవని తెలిపారు. త్వరలోనే బయటికి వస్తానని, తన వాగ్దానం పూర్తి చేస్తానని.. కేజ్రీవాల్ ప్రామిస్ చేసి నిలుపుకోలేనిది ఏదీ లేదంటూ లేఖ రాశారని సునీత కేజ్రీవాల్ తెలిపారు.

Arvind Kejriwal Arrest: ఐదు నెలలు.. 10 సమన్లు.. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ముందు ఏం జరిగిందంటే?

దేశ ప్రజలకు పిలుపు

ఆప్ కార్యకర్తలకు తన విన్నపం ఒకటేనని.. గుడికి వెళ్లి తన కోసం ప్రార్థించాలన్నారు. మన సేవ ఆగకూడదని, ప్రస్తుత పరిణామాలతో బీజేపీ శ్రేణులపై ద్వేషం పెంచుకోవద్దని అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను త్వరలోనే బయటకు వస్తానని కేజ్రీవాల్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 01:31 PM