Home » Kejriwal
తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.
కేజ్రీవాల్‌ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్ శనివారం ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
Bail to Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది. ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వినతిని ఈడీ వ్యతిరేకించింది.
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారానికి రిజర్వ్ చేసింది.