Home » Kesineni Nani
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడన్నారు.
ఎంపీ కేశినేని నాని నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులూ లేవన్నారు. కేంద్ర హోం మత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు. అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడబోనన్నారు. అందరినీ కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనన్నారు. తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారన్నారు.
ఏపీ సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారన్నారు. గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి...కబ్జా చేశారని ఆరోపించారు.
‘విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా నాకు అభ్యంతరం లేదు, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానేమో..’ అంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
విజయవాడ లోక్‌సభ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయని, ఒకటి చంద్రబాబు, రెండోది జగన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం కొసమెరుపు. విరోధాలు ఆ ఇద్దరి మధ్యే గానీ తమ మధ్య లేవని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఔదార్యం ప్రదర్శించారు. పేదవానికి ఉచితంగా సి.యన్.జి ఆటోను బహూకరించారు. దానిని ఎంపీ కేశినేని నాని చేతుల మీదుగా అందజేశారు. ఆ తరువాత ఆటోలో కేశినేని నాని కొద్ది దూరం ప్రయాణించి వచ్చారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతల దాడిని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఖండించారు.
దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చిన ఘనత
టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సతీమణి నారా బ్రాహ్మణి (Nara Bramhani) రాజకీయాల్లోకి (Politics) వచ్చేస్తున్నారా..? రాజకీయాలు, సినిమాలు (Cinemas) అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన ఆమె..