Home » Khairatabad
సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్(Khairatabad0 మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు.
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) సూచించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు (MLA Maganti Gopinath) చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.
భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశుడికి (Khairatabad Ganesh) భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులుఈరోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి.
Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు బీఆర్ఎస్ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో గల ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఖైరతాబాద్(Khairatabad)లో కేంద్ర ప్రభుత్వ పథకాలను రిజిస్టర్ చేసుకునే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
Telangana: నగరంలోని ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన చావ్రోలెట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ నగర్ బస్తివాసుల ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రజాభవన్ ముందు ప్రకాష్ నగర్ బస్తివాసులు ఆందోళన నిర్వహించారు. తన అనుచరుడు సుధీర్ గౌడ్ పేరుతో దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆరోపించారు.