Home » Khammam Floods
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు విలయం నుంచి బాధితులు తేరుకుంటున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారులపై బురదను శుభ్రం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు.
సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు. ఒంటి చేత్తో పోరాడి వందల మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ.. కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్ హీరోలుగా నిలుస్తుంటారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా మున్నేరు వరదల్లో ప్రకాశ్‌నగ్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9మందిని బయటికి తీసుకురాలేకపోయారని బీఆర్‌ఎస్ ఎమ్మల్యే హరీశ్‌రావు విమర్శించారు.
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇళ్లు..! ఖమ్మంలో మున్నేరు విలయంతో ఎటుచూసినా విషాద గాథలే..! ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే..!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రెండ్రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజిబిజీగా గడుపుతున్నారు. ఖమ్మంకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? భారీ వరదలకు, ఇంతటి బీభత్సానికి కారణాలేంటి..? అనే దానిపై రివ్యూ చేసిన రేవంత్.. మీడియాతో చిట్ చాట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు..
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది...