Home » Khammam News
వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
తల్లాడ మండలం అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలంలో మందు చల్లుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు.
కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారం కోసం బటన్లు నొక్కే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిర ఈశాన్య మండపం కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన మండపాన్ని కూల్చివేసి పరిస్థితి చక్కదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన రోజుల్లో పలువురు అభ్యర్థులు నాలుగు, ఐదు ఉద్యోగాలకు ఎంపికై స్పూర్తిదాయకంగా నిలిచారు. ఖమ్మం నగరానికి చెందిన గడ్డం సింధూర, వికారాబాద్ జిల్లాకు చెందిన ఎం.డీ సమీయుద్దీన్‌లు ఈ ఘనత సాధించారు.