Minister Thummala: నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:47 PM
ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్‌లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖమ్మం: పూజ్యులు నందమూరి తారక రామారావు దీవెనలతో తాను రాజకీయాల్లో ఉన్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు. సెంటి మీటర్ లేని జిల్లాలో జాతీయ రహదారులుతో ప్రగతి బాటలు పట్టించానని పేర్కొన్నారు. కాకతీయులు కాలం నుంచి కుమ్మ వారి చరిత్ర సజీవ సాక్ష్యమని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో కార్తీక ఇవాళ(ఆదివారం) వన సమారాధనల సందడి నెలకొంది. చెరుకూరి వారి తోటలో యాదవ బ్రాహ్మణ వైశ్య వన సమారాధన, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో కమ్మ వారి వన సమారాధన జరిగాయి. ఈ రెండు వన సమారాధనల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా కమ్మ వారికి తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన పూజ్యులు నందమూరి తారక రామారావు అని ప్రశంసించారు.
కమ్మ జాతి అన్నికులాలను అక్కున చేర్చుకొని ఆదర్శంగా ఉంటారని తెలిపారు. పోయేటపుడు బంగారం వజ్రాలు నగలు మనతో రావు అని చెప్పారు. దాన గుణం కమ్మ వారికి ఆభరణమని అన్నారు. కాకతీయులు ముసునూరు కమ్మ రాజుల స్ఫూర్తి ముందు తరాలకు ఆదర్శమని చెప్పారు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న కమ్మ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్‌లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.