Share News

Khammam: బీఆర్‌ఎస్‌ నేత అరెస్టు.. ఉద్రిక్తత...

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:19 PM

బీఆర్‌ఎస్‌ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్టు ఘటన గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల తీరు హైడ్రామాను తలపించగా, బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులు ఆందోళనలకు దిగాయి. చింతకాని మండలంలోని పొద్దుటూరుతో పాటు మధిర, వైరాల్లో పోలీసుల చర్య కలకలం రేపింది. కారులో మఫ్టీలో వచ్చిన నలుగురు ఎస్‌ఐలు, ఒక సీఐ... అయ్యప్ప మాలలో ఉన్న పుల్లయ్యను బలవంతంగా తీసుకెళ్తుండగా, ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

Khammam: బీఆర్‌ఎస్‌ నేత అరెస్టు.. ఉద్రిక్తత...

- విధులకు ఆటంకం కలిగించిన కేసులో పుల్లయ్యపై పోలీసుల చర్య

- పొద్దుటూరులో అరెస్టు చేసి తీసుకెళ్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు

- పోలీసుల తీరుతో తీవ్ర అస్వస్థతకు గురైన పుల్లయ్య భార్య

- పలు ప్రాంతాల మీదుగా తిప్పుతూ వైరా పోలీస్ స్టేషన్‌కు తరలింపు

- పోలీసుల తీరుపై జడ్పీ మాజీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ ఆగ్రహం

- మధిర రూరల్‌, వైరా పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనకు దిగిన పార్టీ శ్రేణులు

చింతకాని(ఖమ్మం): బీఆర్‌ఎస్‌ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్టు ఘటన గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల తీరు హైడ్రామాను తలపించగా, బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులు ఆందోళనలకు దిగాయి. చింతకాని మండలంలోని పొద్దుటూరుతో పాటు మధిర, వైరాల్లో పోలీసుల చర్య కలకలం రేపింది. కారులో మఫ్టీలో వచ్చిన నలుగురు ఎస్‌ఐలు, ఒక సీఐ... అయ్యప్ప మాలలో ఉన్న పుల్లయ్యను బలవంతంగా తీసుకెళ్తుండగా, ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వివరాల్లోకి వెళ్లితే...

ఈ వార్తను కూడా చదవండి: Collector: పని చేయలేకుంటే సెలవుపై వెళ్లండి...


చింతకాని మండలం పొద్దుటూరులో గల బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య ఇంటికి గురువారం మధ్యాహ్నం వైరా సీఐ సాగర్‌ నేతృత్వంలో వైరా, కొణిజర్ల, తల్లాడ, బోనకల్‌ ఎస్‌ఐలు మఫ్టీలో వచ్చారు. ఇంట్లో వున్న పుల్లయ్యను ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన అయ్యప్పమాలలో ఉన్నారు. అనంతరం కారులోకి ఎక్కించి తరలిస్తుండగా... ఏ కారణం చేత తీసుకువెళ్లుతున్నారో తెలియజేయాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కారుకు అడ్డం తిరిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు కారుకు అడ్డుగా నిలబడిన వారిని పక్కకు నెట్టి ముందుకు కదిలారు.

.


మండలంలోని లచ్చగూడెం గ్రామంలో ఈ నెల 5న జరిగిన ఘటన పుల్లయ్య అరెస్టుకు దారి తీసింది. ఆ రోజు లచ్చగూడెంలో విద్యుదాఘాతానికి గురై గూని ప్రసాద్‌ అనే రైతు మృతిచెందాడు. ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో కొదుమూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు ధర్నా చేశారు. అధికారులు స్పందించకపోవడంతో మృతదేహాన్ని కలెక్టర్‌ కార్యాలయానికి తరలించి ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించుకుని ఖమ్మం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌తోపాటు కొంత మంది గ్రామస్థులు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. అయితే ఆ రోజు బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోద్బలంతోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం పోలీసులు పుల్లయ్యను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. కాగా, అయ్పప్ప మాలధారణలో ఉన్న పుల్లయ్యను అరెస్ట్‌ చేయడంతో అతని భార్య భారతమ్మ ఒక్కసారిగా అస్వస్థతకు లోనుకాగా, కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

yyyy.jpg


మధిర రూరల్‌ పోలీస్ స్టేషన్‌ వద్ద ఆందోళన

పొద్దుటూరులో పుల్లయ్యను అరెస్టు చేసిన పోలీసులు.. డైరెక్టు రూట్‌లో కాకుండా, వివిధ మండలాల మీదుగా మధిరరూరల్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేత, జడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. పుల్లయ్యను స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఎందుకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. ఆందోళనలో కమల్‌రాజ్‌తోపాటు నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కరరెడ్డి, అబ్బూరి రామన్‌, మేడిశెట్టి నాగేశ్వరరావు, అరిగే శ్రీను, రవి, అప్పారావు పాల్గొన్నారు.


వైరాలో ఉద్రిక్తత

పుల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పుల్లయ్యను పొద్దుటూరులోని తన ఇంట్లో అయ్యప్పమాల దీక్షలో ఉండగా అదుపులోకి తీసుకున్న అనంతరం ఖమ్మం, బోనకల్‌, మధిర తదితర ప్రాంతాల్లో తిప్పి ఏపీలోని గంపలగూడెం మండలంలోని తదితర ప్రాంతాల గుండా తిప్పుతూ సాయంత్రానికి వైరా పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. వైరా, కల్లూరు ఏసీపీలు ఎంఏ.రెహ్మాన్‌, రఘు, వైరా, మధిర సీఐలు ఎన్‌.సాగర్‌, మధు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ, పలు స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లను వైరాలో మోహరించారు.


ఇదే సమయంలో జడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, మధిర బీఆర్‌ఎస్‌ నేతలు వైరా చేరుకొని ఏసీపీతో చర్చించారు. లచ్చగూడెంలో గూని ప్రసాద్‌ దుర్మరణం సందర్భంగా జరిగిన సంఘటనలో పోలీసుల పట్ల పుల్లయ్య ప్రోత్సాహంతో గూని నరేష్‌ అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడని, ఆ ఘటనపై నమోదుచేసిన కేసులో అరెస్టు చేసినట్లు కమల్‌రాజ్‌కు తెలిపారు. అనంతరం కమల్‌రాజ్‌ బయటకు వచ్చి రోడ్డుపైన గుమిగూడిన పొద్దుటూరు బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పరిస్థితిని వివరించారు. దీంతో నాయకులు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత పుల్లయ్య, నరే్‌షను సీఐ సాగర్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య ఖమ్మం కోర్టుకు తరలించారు

Updated Date - Oct 25 , 2024 | 01:19 PM