Share News

Liquor stores: షాపు అక్కడ.. ఊపు ఇక్కడ!

ABN , Publish Date - Oct 15 , 2024 | 01:04 PM

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మద్యం టెండర్లు(Liquor tenders) జరిగితే సరిహద్దు జిల్లాలోని మద్యం వ్యాపారులు పాల్గొంటారు. గతేడాది తెలంగాణలో జరిగిన మద్యం టెండరు ప్రక్రియలో ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు జోరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మద్యం టెండర్లలో పాల్గొన్నారు. అ

Liquor stores: షాపు అక్కడ.. ఊపు ఇక్కడ!

- ఏపీ మద్యం దుకాణాల్లో ఉమ్మడి జిల్లా వ్యాపారుల లక్కు

- సరిహద్దు జిల్లాల్లో 40 శాతం దుకాణాలు కైవసం

ఖమ్మం: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మద్యం టెండర్లు(Liquor tenders) జరిగితే సరిహద్దు జిల్లాలోని మద్యం వ్యాపారులు పాల్గొంటారు. గతేడాది తెలంగాణలో జరిగిన మద్యం టెండరు ప్రక్రియలో ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు జోరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మద్యం టెండర్లలో పాల్గొన్నారు. అదేస్థాయిలో మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మద్యం దుకాణాలకు టెండరు ప్రక్రియ జరిగింది. ఏపీలో కూడా ప్రభుత్వం మారింది. పారదర్శకంగా మద్యం వ్యాపారం జరుగుతుందని ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా నుంచి మద్యం వ్యాపారులు ఏపీలో మకాం వేశారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ఏపీలో మద్యం టెండర్లు వేసేందుకు వెళ్లిన వారికి అక్కడి వ్యాపారులు సహకారం అందిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: CAT: ఐఏఎస్‌ల పిటిషన్‌పై కాట్‌లో విచారణ ప్రారంభం


సరిహద్దు జిల్లాలో 40శాతం దుకాణాలు కైవసం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌(Telangana, Andhra Pradesh) సరిహాద్దులో ఎన్టీఆర్‌, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఎన్టీఆర్‌ జిల్లా ఖమ్మం జిల్లా సరిహద్దుతో, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా సరిహద్దులో ఉన్నాయి. సోమవారంతో ఏపీలో మద్యం టెండర్లు ప్రక్రియ ముగిసింది. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా, ఇక పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని మద్యం దుకాణాల్లో 40శాతం దుకాణాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు.


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................

Anantapur: రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవు..

అనంతపురం: ఈనెల 16, 17 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం బాగుంటే సెలవులను రద్దు చేస్తామన్నారు. కలెక్టరేట్‌లోను, అన్నిమండల కేంద్రాలలోను ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈనెల16, 17 తేదీలలో పల్లెపండుగ కార్యక్రమాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుకొని వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రమాదకరం గా ఉన్న బ్రిడ్జిలు, భవనాలను గుర్తించాలని అక్కడకు ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

pandu4.jpg


లోతట్టుప్రాంతాలను గుర్తించి ఎక్కడా జనం ఇబ్బందులు పడకుండా, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్‌ ట్యాంకులను తహసీల్దార్‌, మైనర్‌ ఇరిగేషన్‌శాఖ అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఆట్యాంకుల వద్ద వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను పర్యవేక్షణకు నియమించాలని ఆదేశించారు. వర్షాల గురించి ముందుగానే గ్రామాలలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తంచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయశాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, సీపీఓ అశోక్‌కుమార్‌, ఎల్‌డీఎం నర్సింగరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఈ.బీ.దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ఇదికూడా చదవండి: Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

ఇదికూడా చదవండి: Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2024 | 01:05 PM