Home » Khammam
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిర ఈశాన్య మండపం కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన మండపాన్ని కూల్చివేసి పరిస్థితి చక్కదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
Telangana: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం అన్నదాన సత్రం వద్ద వరద నీరు నిలవడంపై మండిపడ్డారు. మంత్రి ఆదేశాలను గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నీటిలో మునిగి వున్న రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగనట్లైంది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన రోజుల్లో పలువురు అభ్యర్థులు నాలుగు, ఐదు ఉద్యోగాలకు ఎంపికై స్పూర్తిదాయకంగా నిలిచారు. ఖమ్మం నగరానికి చెందిన గడ్డం సింధూర, వికారాబాద్ జిల్లాకు చెందిన ఎం.డీ సమీయుద్దీన్‌లు ఈ ఘనత సాధించారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
అవి 58 ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గుర్తులు.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్తు వెలుగులు అందింది అక్కడి నుంచే.. తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది అక్కడే.. 100 మీటర్లపైన పొడువుతో ఎంతో గంభీరంగా కనపడే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కూలింగ్ టవర్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.
యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు ఇప్పించి, వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సమాజంలో అన్ని వర్గాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఖమ్మంలో ఈ నెల 9 నుంచి 11 వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ‘నెలనెల వెన్నెల’, ఖమ్మం కళాపరిషత్, ప్రజానాట్యమండలి కళాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలు జరగనున్నాయి.
ఖమ్మం జిల్లా: నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు.
Telangana: జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయ్యింది. గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళలో అన్నవితరణ చేయాలని అఖిల భారత అయ్యప్పధర్మ ప్రచారసభ(ఏబీఏపీ) నిర్ణయించింది. ఖమ్మంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన ఏబీఏపీ జాతీయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారసభ జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాస్ వెల్లడించారు.