Share News

Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్...

ABN , Publish Date - Aug 02 , 2024 | 11:26 AM

Telangana: జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయ్యింది. గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్‌తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా

Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్...
Sitarama Project

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 2: జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌లో (Sitarama Project) మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయ్యింది. గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్‌తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా ఇరిగేషన్ అధికారులు దిగవకు విడుదల చేశారు. ట్రయల్ రన్ కోసం ఒక జపాన్ టెక్నీషియన్‌తో పాటు చైనా అనుబంధ టెక్నీషియన్ల బృందం గత పది రోజులుగా అవిశ్రాంతిగా పనిచేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంపట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwar Rao) హర్షం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ అధికారులకు అభినందనలు తెలియజేశారు.

Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చింది


జూన్‌లోనే పంప్‌ హౌస్ 1ట్రాయల్ రన్...

కాగా.. జూన్ నెలలో సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్​హౌస్​ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్​ను జూన్ 26న అర్ధరాత్రి చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్‌లో భాగంగా.. పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని సూమారు 9 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.

Chandrababu : సీమలో ప్రతి ఎకరాకు సాగు నీరు


అలాగే ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలు పరవళ్లు తొక్కడంపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. నీరు పారుతున్న చోట భూమికి సాష్టాంగ నమస్కారం చేశారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో అధికారులకు అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరికన్నారు. ఖమ్మం జిల్లా సాగుకు గోదావరి జలాలు అందించాలనేది తన జీవిత, రాజకీయ లక్ష్యమని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌కు భూమి ఇచ్చిన వారికి తుమ్మల పాదాభివందనాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Today Horoscope: ఈ రాశి విద్యాసంస్థలు, ఫైనాన్స్‌ కంపెనీల వారు జాగ్రత్తలు పాటించాలి

Dogs: గంటల వ్యవధిలో 28 మందిపై కుక్కల దాడి.. జంకుతున్న జనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2024 | 11:31 AM