Share News

Industrial Park: పరిశ్రమలు స్థాపించే యువతకు రుణాలు: భట్టి

ABN , Publish Date - Aug 06 , 2024 | 02:53 AM

యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు ఇప్పించి, వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సమాజంలో అన్ని వర్గాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Industrial Park: పరిశ్రమలు స్థాపించే యువతకు రుణాలు: భట్టి

  • మధిరలో ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శంకుస్థాపన

మధిరరూరల్‌, ఆగస్టు 5: యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు ఇప్పించి, వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సమాజంలో అన్ని వర్గాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం యండపల్లి గ్రామంలో 84 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్‌ పార్క్‌కు సోమవారం భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రంమలో ఆయన మాట్లాడుతూ... అందరూ వ్యవసాయ రంగంపైనే ఆధారపడితే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బందిపడతామని హితవు పలికారు.


బాగా చదువుకున్న యువత పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. గ్రామాల్లో వ్యాపారం చేసేవారు కాలనుగుణంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అలాంటి వారికి ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇండస్ర్టియల్‌ పార్క్‌కు రూ.44కోట్ల నిధులు కేటాయించామని, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 06 , 2024 | 02:54 AM