Khammam: కేరళలో అయ్యప్ప భక్తులకు అన్నవితరణ
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:35 AM
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళలో అన్నవితరణ చేయాలని అఖిల భారత అయ్యప్పధర్మ ప్రచారసభ(ఏబీఏపీ) నిర్ణయించింది. ఖమ్మంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన ఏబీఏపీ జాతీయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారసభ జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాస్ వెల్లడించారు.
ఆగస్టు 10, 11 తేదీల్లో కాంచీపురంలో సమావేశాలు
ఏబీఏపీ జాతీయ సమావేశంలో తీర్మానాలు
ఖమ్మం కార్పొరేషన్, జూలై 28: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళలో అన్నవితరణ చేయాలని అఖిల భారత అయ్యప్పధర్మ ప్రచారసభ(ఏబీఏపీ) నిర్ణయించింది. ఖమ్మంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన ఏబీఏపీ జాతీయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారసభ జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాస్ వెల్లడించారు. ఏబీఏపీ జాతీయ కార్యదర్శిగా బేతి తిరుమలరావును నియమిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వివరించారు. ‘‘ఏబీఏపీ ఆధ్వర్యంలో కేరళలోని నారాయణతోడులో అన్నదాన మందిరాన్ని నిర్మించాలని తీర్మానించాం.
తమిళనాడులోని కాంచీపురంలో ఏబీఏపీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఏబీఏపీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. వారికి అయ్యప్ప సేవారత్న అవార్డులను ప్రదానం చేస్తాం’’ అని పేర్కొన్నారు.