Home » Khammam
ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల డాక్టర్లు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాటలతోనే రోగులకు సగం రోగం తగ్గిపోవాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
కృష్ణా పరిధిలో ఎగువన వర్షాలు, వరదలతో నది పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది.
షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా దొంగలు నాలుగు బోగీల్లో(ఎస్-3,4,5,6) బంగారం, నగదు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లారు.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సికిల్ సెల్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. సికిల్సెల్ ఎక్కువగా గిరిజన, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే ఉంటుంది.
తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture minister) తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. రుణమాఫీ-2024లో మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
వైద్యం కోసం ఖమ్మం వచ్చి.. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారిపాలిట మృత్యుశకటమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఎడతెరిపిలేని వాన..! శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా కురుస్తూనే ఉంది..! కొన్నిచోట్ల జల్లులుగా.. ఇంకొన్నిచోట్ల భారీ వర్షంగా..! దీంతో రాష్ట్రం తడిసి ముద్దయింది..! జన జీవనం స్తంభించింది..! ఎటుచూసినా చెరువులు, వాగులు జల కళ సంతరించుకున్నాయి.
మణుగూరుతోపాటు సబ్ డివిజన్ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి, తహసీల్దార్ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్పీ రవీందర్రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు.