Home » Khammam
రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్ధమవడంతో ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని
రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకోబోమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తమ్ముల నాగేశ్వరరావు తెలిపారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలు గురువారం ఖమ్మంలో ఘనంగా ముగిశాయి.
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు తీర్చేందుకే ప్రజల మధ్యకు వచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నింటినీ ఆపేస్తామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..
వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు.
శాసనమండలి నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.