Share News

Khammam: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో ఒక పాలసీ..

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:16 AM

రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

Khammam: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో ఒక పాలసీ..

  • హైదరాబాద్‌ జర్నలిస్టు సొసైటీ కోసం పదిరోజుల్లో జీవో

  • జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల గడువు 3 నెలల పొడిగింపు: మంత్రి పొంగులేటి

ఖమ్మం సాంస్కృతికం, జూన్‌ 19: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్‌ అయినా గత ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలను కేటాయించలేదని, త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్‌ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం.. పదిరోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.


అలాగే హైదరాబాద్‌లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు, జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకొస్తామని అన్నారు. అక్రిడిటేషన్‌ గడువు ఈ నెలఖారుతో ముగుస్తోందని దాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హెల్త్‌ కార్డులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని పొంగులేటి ప్రకటించారు. అనంతరం మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం సమాచారశాఖను నిర్వీర్యం చేసిందన్నారు. అప్పటి ప్రభుత్వంలో సమాచారశాఖకు మంత్రి లేకపోవటంతో జర్నలిస్టులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 20 , 2024 | 05:16 AM