Share News

Minister Ponguleti: కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Jun 13 , 2024 | 10:22 AM

ఖమ్మం జిల్లా: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు తీర్చేందుకే ప్రజల మధ్యకు వచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Minister Ponguleti: కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం (Indiramma Rajyam) తెచ్చుకున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు తీర్చేందుకే ప్రజల మధ్యకు వచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, చిన్నతండాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంత్రిని తానే కాబట్టి రాబోయే మూడు సంవత్సరాలలోపే అర్హులైన వారికి ఇస్తామని స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఇళ్ళు ఇస్తామన్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు బయటకు తీసి పేదలకు పంచుతామన్నారు. గడిచిన పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు. పేదల కష్టాల్లో పెద్ద కొడుకుగా ఉండి వాటిని తీరుస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

పెన్షన్‌ పెంపు దిశగా చంద్రబాబు చర్యలు..

చంద్రబాబు కేబినెట్ కూర్పుపై వీహెచ్ ప్రశంసలు

పరదాలు కట్టొద్దని చెప్పానుగా..: లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 13 , 2024 | 10:34 AM