Home » Kishan Reddy G
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.
ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్ను ఫోన్లో పరామర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లిస్తే.. కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది?.. గాడిద గుడ్డు’ అంటూ ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్లో ఏమీ లేదని కేంద్ర బొగ్గు,గనులశాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ.. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణతో వచ్చేవారం మంగళాశాసనాలు సమర్పిస్తోంది. భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా, ఆరెస్సెస్ మహిళా సేవికా సమితిలకు ఈ గ్రంధం వందల సంఖ్యలో పంచనుంది. ఇప్పటికే సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కధలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా తెలుగులోగిళ్ళకు అందించిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురిస్తున్న ఈ గ్రంధాన్ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రోత్సాహంతో గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి సౌజన్యంతో అందుతోంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అందించిన శ్రీవిద్యల రచనా సంకలనమే ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.