Share News

Kishan Reddy: అభూత కల్పన.. గారడీలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:46 AM

అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్‌లో ఏమీ లేదని కేంద్ర బొగ్గు,గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

Kishan Reddy: అభూత కల్పన.. గారడీలు

  • పంట పెట్టుబడుల సాయానికి కేటాయింపులేవీ?

  • మైనార్టీల సంతుష్టీకరణే కాంగ్రెస్‌ ఏకైక లక్ష్యం

  • వారికి ఏకంగా 30ు నిధుల పెంపు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జులై 25 (ఆంధ్రజ్యోతి): అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్‌లో ఏమీ లేదని కేంద్ర బొగ్గు,గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందని, ప్రతి సంవత్సరం రైతులకు సీజన్‌ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ‘ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం కేటాయింపులు తగ్గిపోయాయి.


మొత్తం ప్రపంచం ఏమైపోయినా ఫరవాలేదు... మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే చాలనే కాంగ్రెస్‌ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్లో బట్టబయలైంది. 2023-24లో రూ.2వేల కోట్లుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను ఏకంగా రూ.3,003కోట్లకు పెంచారు. అంటే ఒక్క ఏడాదిలోనే 30 శాతం పెంచేశారు’ అని ఆరోపించారు. గత సర్కారు విచ్చలవిడిగా చేసిన అప్పులు కట్టేందుకు, ఆరు గ్యారంటీలను అమలు చేేసందుకు మరిన్ని అప్పులు చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Jul 26 , 2024 | 04:46 AM