Home » Kodandaram
హైదరాబాద్: నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీ ముందున్న గన్ పార్క్కు కోదండరాం చేరుకున్నారు.
కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు కోదాడ పట్టణంలో కోదండరామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని కోదండరామ్ అన్నారు.
ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కి టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ( Kodandaram ) సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ చీఫ్ కోదండరాం పోరాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం కోదండరాంతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆయన మద్దతు కాంగ్రెస్కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు టీజేఎస్ అధినేత ఓకే చెప్పేశారు.
టీజేఎఫ్ చీఫ్ కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం కరీంనగర్ వి పార్క్లో రాహుల్తో భేటీ అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో కోదండరాం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు.