Kodandaram: దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న మోదీ
ABN , Publish Date - Apr 14 , 2024 | 09:44 PM
దేశ సంపద అంత బడాబాబులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచి పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) అన్నారు. దేశంలో 162 మంది సంపన్నులుంటే....జాతీ సంపద అంత 25 శాతం మంది గుప్పిట్లోనే ఉందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు.
హనుమకొండ: దేశ సంపద అంత బడాబాబులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచి పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) అన్నారు. దేశంలో 162 మంది సంపన్నులుంటే....జాతీ సంపద అంత 25 శాతం మంది గుప్పిట్లోనే ఉందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు.
Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టం అందరిని సమానంగా చూడాలని రాశారని గుర్తుచేశారు. ప్రజలందరూ సమానులేనని ప్రజల్లో అసమానతలు ఉండవద్దని రాశారని చెప్పారు. సమాజంలో అసమానతలు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతలను తొలింగించాల్సిన బాధ్యత పాలకులదేనని తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోతోందని కోదండరామ్ అన్నారు.
TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి
తెలంగాణ వార్తల కోసం...