Home » Kolkata
భారత్‌లో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ దారుణ హత్యపై ఆ దేశ డిటెక్టివ్ చీఫ్ హరుణ్ ఆర్ రషీద్ సోమవారం కోల్‌కతాలో స్పందించారు. ఎంపీ అజీమ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ తరహా హత్య తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అక్రమ బంగారం(gold) వెలుగులోకి వచ్చింది. నిన్న ఆరో దశ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో భారీగా పుత్తడిని అధికారులు పట్టుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
'రెమాల్(Remal)' తుపాను ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు విమానాలతోపాటు రైళ్లను కూడా రద్దు చేశారు.
చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు శుక్రవారం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని బెంగాల్లోనే అరెస్టు చేశారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరడం పక్కా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి ఫోటోలు దిగుతున్నారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా కాంగ్రె్‌సలో చేరడం ఖాయమన్నారు.
కోల్‌కతాలో అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ దారుణ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ దేశ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ వెల్లడించారు. ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగిందన్నారు.
వైద్య చికిత్స కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ అదృశ్యమైయ్యారు. ఈ ఘటన కోల్‌కత్తాలో చోటు చేసుకుంది. ఎంపీ అజిమ్ అనార్ ఆచూకీ కోసం చర్యలు చేపట్టినట్లు కోల్‌కతా పోలీసులు బుధవారం వెల్లడించారు.
శ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణంపై కోల్కత్తా హైకోర్టు ఇటీవల సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే కోల్కత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది. దాదాపు 24 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం.. 2016లో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది.
పశ్చిమబెంగాల్ సీఎం మమత మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు శనివారం ఆమె హెలికాప్టర్ ఎక్కారు.