Share News

Kishan Reddy: 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి..

ABN , Publish Date - May 24 , 2024 | 02:43 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరడం పక్కా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి ఫోటోలు దిగుతున్నారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా కాంగ్రె్‌సలో చేరడం ఖాయమన్నారు.

Kishan Reddy: 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి..

  • లోక్‌సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్కా

  • గులాబీ ముఖ్య నేతలూ ఆ పార్టీలో ఉండరు

  • కేంద్రం డబ్బులిస్తున్నా ధాన్యం కొనలేరా?

  • బోనస్‌ అంటే ధాన్యం మొలకెత్తడమా: కిషన్‌రెడ్డి

    (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరడం పక్కా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి ఫోటోలు దిగుతున్నారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా కాంగ్రె్‌సలో చేరడం ఖాయమన్నారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన ముఖ్యులు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనన్నారు. గతంలో కూడా కాంగ్రెస్‌ నుంచి 19మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎ్‌సలో చేరారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రక్షించుకోలేని బీఆర్‌ఎ్‌సకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయడం వృథా అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఖమ్మంలో పర్యటించిన కిషన్‌రెడ్డి స్థానిక శ్రీశ్రీ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.


రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం బీజేపీనేనని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. నాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్‌ అంటే.. నేడు దొడ్డు వడ్లు వేస్తే ఉరి అని రేవంత్‌రెడ్డి అంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని రాఘవాపూర్‌, రుద్రవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంటే.. సకాలకంలో కొనేందుకు రాష్ట్ర సర్కారుకు ఏం నొప్పి..? అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తుతుంటే సీఎంకు సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం లేదన్నారు. బోనస్‌ అంటే.. వడ్లు మొలకలు రావడమేనా..? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..? అని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడంలేదని తెలిపారు. అన్నదాతలు పంటలు ఎలా సాగు చేయాలో రాహుల్‌ గాంధీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సన్న వడ్ల సాగును ప్రోత్సహించాలనుకుంటే.. వాటికి రూ.1,000 బోనస్‌ ఇవ్వాలని, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.


కలకత్తా హైకోర్టు తీర్పు కాంగ్రె్‌సకు చెంపపెట్టు: లక్ష్మణ్‌

పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టు లాంటిదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్న మమతాబెనర్జీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌, విపక్ష పార్టీల నైజం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖలో అవినీతి, అక్రమాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ చేశారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై తాను మాట్లాడితే, మంత్రి ఉత్తమ్‌, సమాధానం చెప్పలేక మొహం చాటేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే తనపై పోలీసు కేసు పెట్టించడమేంటని మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 24 , 2024 | 02:43 AM