Home » Kolkata
గువాహటి: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో అసోంలోని ఒక ఆసుపత్రి జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో ఆ అడ్వయిజరీని యాజమాన్యం ఉపసంహరించుకుంది.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వైద్యురాలి మృతి అసహజ మరణమని.. ఈ నేపథ్యంలో కేసు ఎందుకు నమోదు చేయలేదని పశ్చిమ బెంగాల్‌లోని అధికార మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది.
ధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్నానన్న దోష భావన లేదు! దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం లేదు!! పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు! వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్వికారంగా సమాధానాలు చెప్పాడు.
నగరంలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారం కారణంగా మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులకు తొలుత ఆసుపత్రి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలింది.
ట్రైనీ వైద్యురాలు హత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన భయానకమైనదన్నారు. అలాగే హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ప్రొ. సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు.
కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నగరంలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆదివారం విధుల నుంచి తొలగించింది.
కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
లైంగిక దాడి చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసినట్లు నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైందన్నారు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి తీవ్రంగా రక్త స్రావమైందని తెలిపారు. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించామన్నారు.