Share News

Doctor's Murder Case: సీఎం మమతా బెనర్జీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి

ABN , Publish Date - Aug 12 , 2024 | 06:21 PM

ట్రైనీ వైద్యురాలు హత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన భయానకమైనదన్నారు. అలాగే హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.

Doctor's Murder Case: సీఎం మమతా బెనర్జీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
senior Congress leader Priyanka Gandhi Vadra

న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన భయానకమైనదన్నారు. అలాగే హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. తద్వారా మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికి తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

Also Read: Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..


వెల్లువెత్తిన విమర్శలు..

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆసుపత్రిలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడంతో.. సర్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విధితమే. సంచలనం రేపిన ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఇప్పటికే బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి బెంగాల్‌లోని వామపక్ష పార్టీలు సైతం గొంతు కలిపాయి.

Also Read: Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా


అత్యాచార రాజధానిగా..

మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. అలాంటి వేళ ఈ ఘటనపై సమ్మెకు దిగిన వైద్య సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అంతేకాదు.. సమ్మెలో సైతం ఆ పార్టీ శ్రేణులు పాల్గొనడం విశేషం. బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించాయనేందుకు ఈ ఘటన సూచిస్తుందని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజిన్ చౌదరి స్పష్టం చేశారు. గత కొద్ది కాలంగా పశ్చిమ బెంగాల్ ప్రతిష్ట మసకబారిందన్నారు. ఆ క్రమంలో కోల్‌కతా అత్యాచార రాజధానిగా మారిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు సీబీఐకి అప్పగించలన్నారు.


బాధిత కుటుంబానికి సీఎం పరామర్శ...

ఈ రోజు బాధిత కుటుంబాన్ని సీఎం మమతా బెనర్జీ పరామర్శించనున్నారు. అదీకాక ఈ కేసును ఆదివారం లోపు ఛేదించాలని బెంగాల్ పోలీసులకు సీఎం మమతా బెనర్జీ ఆల్టిమేటం జారీ చేశారు. అలా కాకుంటే సీబీఐ దర్యాప్తునకు తమ ప్రభుత్వం సిఫార్స్ చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసే అవకాశముంది.

Also Read: Pune Airport: నకిలీ విమాన టికెట్లతో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


నిందితుడు ఒక్కడు కాదు...

శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ రాయ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరింత మంది నిందితులు ఉన్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని వైద్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం ఆరోపిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 06:23 PM