Share News

Kolkata Doctor's Case: సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్‌కతా హైకోర్టు

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:06 PM

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వైద్యురాలి మృతి అసహజ మరణమని.. ఈ నేపథ్యంలో కేసు ఎందుకు నమోదు చేయలేదని పశ్చిమ బెంగాల్‌లోని అధికార మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది.

Kolkata Doctor's Case: సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్‌కతా హైకోర్టు
Kolkata High Court

కోల్‌కతా, ఆగస్ట్ 13: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వైద్యురాలి మృతి అసహజ మరణమని.. ఈ నేపథ్యంలో కేసు ఎందుకు నమోదు చేయలేదని పశ్చిమ బెంగాల్‌లోని అధికార మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలుత ప్రశ్నించాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.


విమర్శలు వెల్లువెత్తడంతో.. ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా..

ట్రైయినీ వైద్యురాలి మృతి నేపథ్యంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సోషల్ మీడియాలో విమర్శలు అయితే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. కాలేజీ ప్రిన్సిపాల్ పదవి నుంచి వెైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన వైద్యురాలు తన కుమార్తె వంటిదన్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని ఆయన ఆకాంక్షించారు.

దాంతో కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే మరో కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన ఎలా నియమితులయ్యారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలలోపు ప్రొ. సందీప్ ఘోష్ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లాలని... లేని పక్షంతో అందుకు తగినట్లుగా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read: New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం


స్పందించిన ప్రొ. సందీప్ ఘోష్..

హైకోర్టు వ్యాఖ్యలపై ప్రొ. సందీప్ ఘోష్ స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయ కోణంలో ఈ తరహా విమర్శలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలలో భాగంగా తనను ఈ పదవి నుంచి తొలగించారని ఆయన పేర్కొన్నారు.

దీని వెనుక రాజకీయ కోణం ఉందన్నారు. అదీకాక ఈ హత్యాచారం ఘటన జరిగిన వెంటనే.. తానే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అలాగే మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్ ఆధారాలను సైతం పోలీసులకు అందజేశామన్నారు. ఈ కేసును ఆదివారం లోపు బెంగాల్ పోలీసులు ఛేదించకుంటే... సీబీఐకి అప్పగిస్తామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం విధితమే.

Also Read: Bangladesh Violence: పలువురు బంగ్లాదేశీయులు అరెస్ట్


ఆందోళనకు దిగిన వైద్య సిబ్బంది.. మమత ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు

మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ముఖ్యమంత్రి వారం రోజులు గడువు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విచారణతో తాము సంతోషంగా లేమని వారు స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నామన్నారు. అలాగే బాధితురాలి కుటుంబానికి నష్ట పరిహారం భారీగా అందజేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు


పోస్ట్‌మార్టం నివేదికతోపాటు సీసీఫుటేజ్‌ను బహిర్గతం చేయాలి..

హత్యాచారానికి గురైన బాధితురాలి నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికతోపాటు మృతదేహం లభ్యమైన సెమినార్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌ను వెంటనే బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆందోళనకు దిగిన పోలీసులు డిమాండ్ చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 05:07 PM