Home » Kolkata
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో గత నెలలో దారుణ హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలు అభయ తల్లిదండ్రులు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయాలని పోలీసులు అనుకున్నారని.. ఇందుకోసం తమకు లంచం ఇవ్వజూపారని వారు ఆరోపించారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద విధుల నిర్వహణలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. ఇది 'చరిత్రాత్మిక బిల్లు' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో ట్రయినీ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై అరెస్టయిన మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్కు కోర్టు 8 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఈ మేరకు కోల్కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.
పశ్చిబెంగాల్ రాష్ట్రం బీర్భం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సుతో ఓ రోగి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.
కోల్కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నాయి.
కోల్కతా ఆర్జీకర్ వైద్య కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని మృతిచెందిన విషయం ఆ ఘటనపై కేసు నమోదయ్యేంత వరకూ తనకు తెలియదని ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చెప్పారు.