Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసిన సీబీఐ
ABN , Publish Date - Sep 02 , 2024 | 09:19 PM
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh)ను సీబీఐ (CBI) సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఘోష్ తన హయాంలో అవకవతవకలకు పాల్పడ్డారంటూ సీబీఐ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ క్రమంలో తాజా అరెస్టు చోటుచేసుకుంది.
West Bengal: మమత సర్కార్ అత్యాచార వ్యతిరేక బిల్లు పేరు 'అపరాజిత'... 3న అసెంబ్లీ ముందుకు
కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఘోష్‌తో మూడు ప్రైవేటు సంస్థలపై కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి కేసుకు సంబంధించి ఘోష్ నివాసంపై ఆగస్టు 25న సీబీఐ దాడులు జరిపి రోజంతా సోదాలు చేపట్టింది. ఆసుపత్రి సెమినార్ హాలులో ఆగస్టు 9న అత్యాచారం, హత్యకు గురైన ట్రయినీ డాక్టర్ కేసును సైతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఘోష్ తన హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది. ఘోష్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది.
Read More National News and Latest Telugu New