Share News

ఆర్‌జీ కర్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ ఘోష్‌ అరెస్టు

ABN , Publish Date - Sep 03 , 2024 | 02:49 AM

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.

ఆర్‌జీ కర్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ ఘోష్‌ అరెస్టు

కోల్‌కతా, సెప్టెంబరు 2: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకొంది. ఆ కళాశాలలో ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య జరిగిందన్న కేసులో ఆయనను వరుసగా 15 రోజుల పాటు ప్రశ్నించింది. అనంతరం ఆర్థికంగా అవకతవకలకు పాల్పడ్డారన్న మరో కేసులో అరెస్టు చేసింది. ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆ కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అఖ్తర్‌ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకొంది.

Updated Date - Sep 03 , 2024 | 02:50 AM