Aparajita Bill: 'అపరాజిత' బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:57 PM
పశ్చిమబెంగాల్‌లో ట్రయినీ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ట్రయినీ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది 'చరిత్రాత్మిక బిల్లు' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అత్యాచారం, లైంగిక నేరాలపై కొత్త ప్రొవిజన్స్‌తో రూపొందించిన ఈ బిల్లు మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని అన్నారు.
Mamata Banerjee: 'అపరాజిత' బిల్లు చరిత్రాత్మకం
బిల్లుపై చర్యలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, అత్యాచారాలు మానవత్వానికి మాయని మచ్చ అని, అలాంటి నేరాలకు అట్టుకట్ట వేసేందుకు సామాజిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అపరాజిత బిల్లుపై సంతకం చేయాలని విపక్షాలు గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కోరాలని సూచించారు. అనంతరం చట్టంగా తీసుకు వచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నామని, దోషులకు మరణశిక్ష విధించాలని తాము కోరుతున్నామని చెప్పారు. 'అపరాజిత' బిల్లుతో సత్వర విచారణ, బాధితులకు న్యాయ లభిస్తుందన్నారు. బిల్లు పాస్ కాగానే ప్రత్యేక అపరాజిత టాస్క్‌ఫోరస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోల్‌కతా ట్రయినీ డాక్టర్ మృతికి నివాళి అర్పించారు. కాగా, బిల్లుకు ప్రధాన విపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించింది. లా కమిటీ వద్దకు బిల్లు వెళ్లిందో లేదో తమకు తెలియని, అయితే బిల్లు తక్షణం అమలు కావాలని తాము కోరుతున్నామని, తక్షణ ఫలితాలు ఆశిస్తున్నామని, బిల్లుకు తమ మద్దతు ఉంటుందని అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి చెప్పారు.
Read More National News and Latest Telugu New