Home » Komati Reddy Venkat Reddy
రోడ్లు, భవనాల శాఖలో పదవీ విరమణల అంశం చిచ్చు రేపుతోంది. ఈ నెల 31 నుంచి డిసెంబరు వరకు వివిధ హోదాల్లోని 37 మంది రిటైర్ కాబోతున్నారు. వారిలో కొంతమంది తమకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి కేసీఆర్ మతి స్థిమితం కోల్పోయారని, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే ఆయన అసెంబ్లీకి రావడం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ బాద్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే గనక కొత్త దుకాణం పెట్టాలనే ఆలోచనతో హరీశ్‌రావు ఉన్నారని, జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(BRS Working President KTR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని(Telangana CM Revanth Reddy) తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada High Way) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్‌ని అధికారులు గుర్తించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Telangana: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పరాన్న జీవి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ‘‘నా ఆస్తులు, కోమటి రెడ్డి ఆస్తుల లెక్కలు తీయండి. ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో తెలుస్తుంది’’ అని అన్నారు. రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలు అని వ్యాఖ్యలు చేశారు.
‘‘పొరపాటునో, గ్రహపాటునో మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో 2029లో ఎన్నికలుండవు. రష్యా, చైనా, మాదిరిగా 30 ఏళ్ల పాటు ప్రధానిగా ప్రకటించుకుంటారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ