Komatireddy Venkat Reddy: నోరు జాగ్రత్త.. కేటీఆర్‌కు మంత్రి మాస్ వార్నింగ్..!
ABN , Publish Date - May 23 , 2024 | 11:58 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(BRS Working President KTR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని(Telangana CM Revanth Reddy) తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
హైదరాబాద్, మే 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(BRS Working President KTR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని(Telangana CM Revanth Reddy) తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేటీఆర్ బచ్చా అని.. తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కానీ, రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి లీడర్ అయ్యారని పేర్కొన్నారు. రేవంత్ వయసులో పోలిస్తే కేటీఆర్ చిన్న పిల్లాడు అని వ్యాఖ్యానించారు.
సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పొట్ట కొట్టి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవడం ఖాయం అని అన్నారు. మేడిగడ్డ మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూలిపోవడం ఖాయం అన్నారు. కేసీఆర్ కూతురు కవిత చేసిన పనికి రాష్ట్రం పరువు పోతోందని వ్యాఖ్యానించారు మంత్రి. 5వ తేదీ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలే కేటీఆర్, హరీష్ రావుని కొడుతారని అన్నారు. నంది నగర్ నుండి కారులో న్యూట్రల్‌లో వెళ్లినా అసెంబ్లీకి చేరుకోవచ్చునని.. కట్టే పట్టుకొని అసెంబ్లీకి రాలేదు కానీ, బీజేపీ కోసం బస్సులో తిరిగారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి. అసలు తెలంగాణ కోసం కొట్లాడింది తామేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
Also Read: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్
అన్ని స్థానాల్లో ఓటమి తప్పదు..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తుందని.. అన్ని స్థానాల్లో ఓడిపోతుందని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 12 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లీడర్, క్యాడర్ లేకుండా పోతారని అన్నారు. 5వ తేది తర్వాత తెలంగాణ భవన్‌కి తాళం వేసుకోవాల్సి వస్తుందన్నారు. కవితకు బెయిల్ రావట్లేదని కేటీఆర్ పూర్తిగా ఫస్ట్రేషన్‌లోకి వెళ్లారని.. అందుకే ఇష్టారీతిన తమ ప్రభుత్వంపై కారుకూతలు కూస్తున్నారంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
మా సీఎంనే తిడతావా?
‘మా ముఖ్యమంత్రిని తిడుతావా కేటీఆర్.. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నందుకు మా రేవంత్ ని తిడుతున్నావా? 500 రూపాయలకు సిలిండర్, ఉచిత విద్యుత్ ఇవ్వడమే మేం చేస్తున్న పాపమా? హాస్టల్స్, పేదవారికి ఇచ్చే ఉచిత బియ్యం పూర్తిగా సన్నబియ్యం ఇద్దామనుకోవడం తప్పా? మేం ఇచ్చిన నోటిఫికేషన్ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది అంటున్నావ్. మరి మీరే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? మా ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. కేసీఆర్ చేసిన పనికి మూడు డ్యాములు కొట్టుకొని పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారు. వైన్ షాపుల పేరు మీద కేసీఆర్ నాన్ రిఫండబుల్ పైసలు గుంజిండు. ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం. మల్లన్నపై కేసులు ఉన్నాయని అంటున్నావ్.. మీ చెల్లిపై 8000 పేజీల ఛార్జ్ షీట్ పై ఏమంటావ్ కేటీఆర్? మహేశ్వర్ రెడ్డి ఏం పైరవీ చేసుకొని పదవి తెచ్చుకున్నారు? ఆయన పేరు పలకాలంటే సిగ్గుగా ఉంది?’ అని కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read: టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ఫైర్..
తెలంగాణ బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లినా మహేశ్వర్ రెడ్డి ఆర్టీఐ అప్లికేషన్లే ఉంటున్నాయని అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించాలని మహేశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఆర్టీఐలు కోరుతున్న మహేశ్వర్ రెడ్డి.. నిర్మల్ నియోజకవర్గానికి ఏం కావాలని ఒక్కసారైనా అడిగారా? అని మంత్రి ప్రశ్నించారు.