Home » Komati Reddy Venkat Reddy
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.
Telangana: నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘గల్లీ నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తా. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నా సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించిన’’...
మ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, ఆయన సోదరుడు జితేందర్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు.
‘రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్‌రావు ఓ జోకర్‌గా మారారు. ఆయన పేరు హరీశ్‌రావు కాదు ‘హౌలేశ్ రావు’. అధికారం పోయిన తరువాత మతిభ్రమించి అన్నీ హౌలే పనులు చేస్తున్నాడు. రాజకీయాల్లో ఆయనొక జోకర్’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో చిన్న ఎమ్మేల్యే అని, ఆయన స్వేచ్ఛగా అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చారంటే ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చినట్లు అర్థమని అన్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తెలివి ఉందని తాను అనుకున్నానని, కానీ ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఏం తెలియదని తేలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వస్తున్న తరుణంలో..
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని ఆరోపించారు.
Telangana: బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ ఏపాటితో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసుకుంటూ దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా జగదీష్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Telangana: ‘‘నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది’’ అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.