Share News

Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:56 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో చిన్న ఎమ్మేల్యే అని, ఆయన స్వేచ్ఛగా అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చారంటే ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చినట్లు అర్థమని అన్నారు.

Congress: హరీష్‌రావు  రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA), మాజీ మంత్రి హరీష్ రావు (Harishrao) వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venakat Reddy) శుక్రవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో చిన్న ఎమ్మేల్యే అని, ఆయన స్వేచ్ఛగా అమరవీరుల స్థూపం (Martyrs Stupam) దగ్గరికి వచ్చారంటే ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చినట్లు అర్థమని అన్నారు. హరీష్ రాజీనామా (Resignation) స్పీకర్ ఫార్మాట్‌ (Speaker Format)లో లేదని.. అగ్గిపెట్టె నాటకం లాగా ఆయన ఇంకో నాటకానికి తెర లేపారని విమర్శించారు.


ఆగస్టు 15వ తేదీలోపు రైతుల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్ రావు ఓ గుమాస్తా అని, మాట్లాడాల్సింది ఆయన కాదని, కేసీఆర్ మాట్లాడాలని అన్నారు. హరీష్ రావు వాఖ్యలకు విలువ లేదని.. మేము రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్‌ను రద్దు చేస్తారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్దకు రావడంతో అపవిత్రం అయిందన్నారు. కాంగ్రెస్ చేసేదే చెబుతుందని.. చెప్పిందే చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.


కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను (Challenge) స్వీకరిస్తున్నానని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ది తొండి రాజకీయమని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీ లోపు ఏకకాలంలో రైతు ఋణమాఫీ (Farmer loan waiver) చేసి, ఆరు గ్యారెంటీలు (Six Guarantees)అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని.. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? ప్రశ్నించారు. ఈ విషయాలపై తాను శుక్రవారం అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తానని.. సీఎం రేవంత్ కూడా రావాలని హరీష్ రావు అన్నారు.


కాగా రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ నేతలు విసురుతున్న సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూటిగా స్పందించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటానని, మీరు బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రతి సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తనకు సవాల్‌ విసిరారని, అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. లంబాడ గిరిజనుల ఆరాధ్య దైవాలైన బావోజీ, సేవాలాల్‌ల సాక్షిగా ఆగస్టు 15లోగా అది జరుగుతుందని పునరుద్ఘాటించారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో హరీశ్‌రావు తన మామ కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తాను రుణమాఫీ చేస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తారా? అని హరీశ్‌కు సీఎం ప్రతి సవాల్‌ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఇంటికి పోవడం ఖాయం: బాబు

బీసీవై కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల దాడి..

ఆ ముగ్గురి దగ్గరే సంపద: పవన్

చంద్రబాబు వరాల జల్లు...

అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Sports News and Chitrajyothy

Updated Date - Apr 26 , 2024 | 01:02 PM