Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..
ABN , Publish Date - May 08 , 2024 | 01:47 PM
వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.
హైదరాబాద్: వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు. డీ లిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 సీట్లు అవుతాయన్నారు. 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి తెలిపారు. కవితను చూస్తే చాలా నవ్వొస్తోందని అన్నారు.
AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య
కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుంది అనుకున్నామని.. కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని మేం గుర్తించలేదని కోమటిరెడ్డి అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందన్నారు. తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని ఫుట్ బాల్ ఆడుకుంటానన్న తలసాని మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం రూం నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కొందరు డిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారన్నారు. కానీ తాను మాత్రం ఎక్కడికీ వెళ్ళలేదన్నారు. కవిత వల్ల మన పరువు పోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉండాలి
Read Latest Telangana News and National News