Share News

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ABN , Publish Date - May 08 , 2024 | 10:16 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Minister Komati Reddy Venkat Reddy

నల్గొండ: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రూ.2 లక్షలు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేస్తామని ప్రకటించారు.


Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది

నల్గొండ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 5 నుంచి అవినీతికి తావు లేకుండా అభివృద్ధి జరుగుతుందని అన్నారు.డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని వివరించారు.మూసీ, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో ఓపిక ఉంటే పోటీ చేస్తా.. లేదంటే తమ నాయకులు పోటీలో ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రతీక్ పౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవలు అందిస్తామని వెల్లడించారు.బీఆర్ఎస్ అంటే బంద్ అయిన రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.


బీజేపీ పాలనలో ఆదానీ, అంబానీలు బాగుపడ్డారు... తప్పితే సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానని అనడం బీజేపీకి తగదన్నారు. రాజ్యాంగ సవరణ పేరుతో రిజర్వేషన్ ల రద్దుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఉద్ఘాటించారు.మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా ప్రజాస్వామ్యం ఖతం అవుతుందని ఆరోపించారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 10:53 PM