Home » Komati Reddy Venkat Reddy
Telangana: ‘‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్... దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా’’ అంటూ మాజీ ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్వశ్చన్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు.
నల్గొండలో ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ముస్లింలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్ పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు పొలంబాట పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.
Telangana: తుక్కుగూడలో ఈనెల 6న కాంగ్రెస్ బహిరంగ సభకు సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాట్లపై సమావేశం అయ్యామని.. 10 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీగా నాగేందర్‌ను గెలిపించడమే తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. 8న నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుందన్నారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) కాస్తా నోటిని అదుపులో పెట్టుకోవాలని.. తమను ఇష్టారీతిగా విమర్శస్తే చూస్తు ఊరుకోమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) హెచ్చరించారు. సోమవారం నాడు జోగిపేటలోని డీఎల్ ఫంక్షన్ హాల్లో ఆందోల్ నియోజకవర్గం బీజేపీ (BJP) కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Telangana:బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడి పోయామో తెలియడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ ఓటేయాలని.. రుణమాఫీ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేడు ఆయన కాసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారు. ఇద్దరి ముగ్గురి ట్యాపింగ్‌పై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన పాపాలే.. ప్రస్తుతం ఆయన్ని చుట్టుముడుతోన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడారు.