Share News

Komatireddy Venkatreddy: సికింద్రాబాద్ ఎంపీగా దానంను గెలిపించడమే మా బాధ్యత

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:50 PM

Telangana: తుక్కుగూడలో ఈనెల 6న కాంగ్రెస్ బహిరంగ సభకు సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాట్లపై సమావేశం అయ్యామని.. 10 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీగా నాగేందర్‌ను గెలిపించడమే తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. 8న నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుందన్నారు.

Komatireddy Venkatreddy: సికింద్రాబాద్ ఎంపీగా దానంను గెలిపించడమే మా బాధ్యత

రంగారెడ్డి, ఏప్రిల్ 2: తుక్కుగూడలో ఈనెల 6న బహిరంగ సభకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) మాట్లాడుతూ.. తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాట్లపై సమావేశం అయ్యామని.. 10 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీగా నాగేందర్‌ను (MLA Danam Nagender) గెలిపించడమే తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. 8న నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుందన్నారు. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. భువనగిరి, నల్లగొండ ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో నాగేందర్‌ను కూడా గెలిపిస్తామన్నారు.

AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?


బీఆర్ఎస్‌ది (BRS) కుటుంబ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ (Congress) 10 ఏండ్లు అధికారంలో లేకున్నా ఈసారి గెలిచామన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదని, అభివృద్ధి చేయలేదని అన్నారు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నారని.. అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 40 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టును ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అని అంటున్నారని.. హరీష్ రావు మాటలకు అర్థం లేదని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు పడటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు


పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా: దానం

సికింద్రాబాద్ పార్లమెంట్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంచార్జ్‌గా ఉన్నారని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అందరి సహకారం కావాలన్నారు. తుక్కుగుడా సభ విజయవంతం చేయడానికి సమావేశం నిర్వహించినట్లు దానం నాగేందర్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 02 , 2024 | 03:50 PM