Share News

TG Politics: మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. వెంకటరమణారెడ్డి వార్నింగ్

ABN , Publish Date - Apr 01 , 2024 | 10:35 PM

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) కాస్తా నోటిని అదుపులో పెట్టుకోవాలని.. తమను ఇష్టారీతిగా విమర్శస్తే చూస్తు ఊరుకోమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) హెచ్చరించారు. సోమవారం నాడు జోగిపేటలోని డీఎల్ ఫంక్షన్ హాల్లో ఆందోల్ నియోజకవర్గం బీజేపీ (BJP) కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

TG Politics: మంత్రి  కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..  వెంకటరమణారెడ్డి  వార్నింగ్

సంగారెడ్డి జిల్లా: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) కాస్తా నోటిని అదుపులో పెట్టుకోవాలని.. తమను ఇష్టారీతిగా విమర్శస్తే చూస్తు ఊరుకోమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) హెచ్చరించారు. సోమవారం నాడు జోగిపేటలోని డీఎల్ ఫంక్షన్ హాల్లో ఆందోల్ నియోజకవర్గం బీజేపీ (BJP) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బి.బి పాటిల్, వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.


Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడున్నదని మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి 8 అసెంబ్లీ శాసన సభ్యులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ హేళన చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 2028లో 80 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. జహీరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

జహీరాబాద్ అభివృద్ధి కోసం మరోసారి నన్ను గెలిపించాలి: బీబీ పాటిల్

అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే మరోసారి బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్(Bibi Patil) అన్నారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ప్రజలు ఆశీర్వదించాలని బీబీ పాటిల్ కోరారు.

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 10:38 PM