Home » Komati Reddy Venkat Reddy
Telangana: నగరంలోని ఖాజాగూడా బయోడైవర్సిటీ పార్కు పెద్ద చెరువు పక్కన ప్రభుత్వ భూముల్లో కొండలను తవ్వి విల్లాలకు రోడ్లు నిర్మిస్తున్న ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో
రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్‌తో చంద్రశేఖర్ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు..
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనికి షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
నంది పురస్కారం.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా దీనికి పేరుంది. కానీ.. గత ఐదేళ్లుగా ఈ ‘నంది’ ఊసే లేదు. 2017లో చివరిసారిగా నంది అవార్డులను ప్రకటించారు. అంతే.. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు...
పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) నూతన భవన నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వారితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ టి. వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనా రెడ్డి కూడా పరిశీలించారు.
అధికారులంతా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తెలిపారు.
Telangana: పేదవారి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ళు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.