Share News

MinisterVenkat Reddy: పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 06:29 PM

పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

MinisterVenkat Reddy: పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు

నల్గొండ: పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేశామని చెప్పారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రజా పాలన పారదర్శకంగా చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన పారదర్శకంగా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో మొదటిసారి గెలిచినా ఎమ్మెల్యేలు కూడా రాజులా ఫీల్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని గర్భాలు పలికారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో అనుబంధం ఉంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గతంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో తనకు మంచి రాజకీయ సంబంధం ఉందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తన హయాంలో మొదలైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మళ్లీ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హయాంలో పూర్తి కాబోతున్నాయని చెప్పారు. ఈ ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో ముందుకు తీసుకుపోతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 06:29 PM