Share News

Minister Komati Reddy: నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:11 PM

అధికారులంతా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తెలిపారు.

Minister Komati Reddy: నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

నల్గొండ : అధికారులంతా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తెలిపారు. సోమవారం నాడు నల్గొండ కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి. గత పాలకుల్లాగా మేం మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే పాలకులం కాదు. మనమంతా కలిసి పనిచేసి ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించాలి. జిల్లాలో విద్యుత్ సమస్యలు ఉండకూడదు. సబ్ స్టేషన్ల ఏర్పాటు, విస్తరణ కోసం టెండర్లు పిలిచి పనులు చేయకపోవడం పట్ల అధికారులని వివరణ కోరారు. కరెంట్ షాక్‌తో మరణించిన 32 మందికి వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి. విద్యుత్ సమస్యలు తీర్చేందుకు కావాల్సిన నిధుల వివరాలు ఇస్తే సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:11 PM