Share News

Minister Komati Reddy: రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 07:40 PM

రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Komati Reddy: రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

నల్గొండ: రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మెజార్టీ పనులు పూర్తయిన SLBC ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని మండిపడ్డారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్

ఉదయసముద్రం బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్స్‌తో పాటు, పెండింగ్‌లో ఉన్న SLBC టన్నెల్ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే SLBC కాలువలను పూర్తిచేసినప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని మండిపడ్డారు. SLBC కాలువలకు మరియు వరద కాలువకు గత 10 సంవత్సరాల నుంచి మొయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగిందని చెప్పారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు 100 కోట్లు, పనులకు గానూ మరో 100 కోట్లను త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 07:40 PM